ఘోర రోడ్డు ప్రమాదం

– కారును ఢకొీట్టిన టీప్పర్‌
– ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
నవతెలంగాణ-ఆత్మకూర్‌
వరంగల్‌ నుంచి భూపాలపట్నం వెళ్లే జాతీయ రహదారిపై మారుతీ వ్యాగనర్‌ కారును ఎదురుగా అతివేగంగా వస్తున్న టిప్పర్‌.. ఢకొీట్టడంతో కారులో ని నలుగురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఆత్మకూరు సీఐ బండారి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన అనుముల నర్సింహస్వామి(52), వెల్డండి సాంబరా జు (40), వెల్డండి ఆకాంక్ష (26), వెల్డంది లక్ష్మి ప్రసన్న(6).. ములుగు జిల్లా మేడారానికి వెళ్లి వనదే వతలను దర్శించుకొని తిరిగి వస్తున్నారు. హన్మకొం డ జిల్లా ఆత్మకూరు మండలం పత్తిపాక క్రాస్‌ రోడ్డు సమీపంలో వారి కారును వరంగల్‌ నుంచి శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలోని స్టోన్‌ క్రషర్‌కు చెందిన టిప్పర్‌ అతివేగంగా రెండుసార్లు ఢ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడికిఅక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు రాజశ్రీ, ఆర్షిత, అక్షయరాజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు బెలూన్‌ తెరుచుకోవడంతో డ్రైవర్‌ ఆకాష్‌ సురక్షితంగా బయట పడ్డారు. అందరూ వరంగల్‌ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బండారి కుమార్‌ తెలిపారు.

Spread the love