జూ.ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయ్యాయినట్లు తెలుస్తున్నది. గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. కాగా, ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను గత రాత్రే ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు.

Spread the love