ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక మహిళ మృతి, 30 మందికి తీవ్రగాయాలు

నవతెలంగాణ- కర్నూలు : గుంటూరు -కర్నూలు జాతీయ రహదారి ప్రకాశం జిల్లా మేడపి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూలు జిల్లాకు చెందిన మెప్మా సిబ్బంది విజయవాడలో జరిగే సమావేశానికి ప్రయివేటు స్లీపర్ కోచ్ బస్సు వెళుతుండగా మార్గమధ్యమైన మేడపి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, సుమారు 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love