ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాయగిరి సర్వీస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిసిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమాన్ కోట గ్రామానికి చెందిన మామిడి సాయికుమార్ ఘట్‌కేసర్‌లోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పల్సర్ బైక్పై రాగిరి సర్వీస్ రోడ్డులో రాయగిరి వైపు వెళ్తుండగా జియో పెట్రోల్ బంప్ దాటగానే ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు కావాల్సి ఉంది.
Spread the love