కూతురు మృతితో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య..

నవతెలంగాణ – బంజారా హిల్స్

కూతురు మృతి చెందిందని మనస్థాపానికి గురైన ఓ కార్మికులు ఖైరతాబాద్ రైల్వే ట్రాక్పై రైలు వస్తున్న సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన కూతురు చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల మనస్థాపానికి గురైన జే కిషోర్ 39, కార్మికునిగా విధులు నిర్వహిస్తూ ఆర్పి రోడ్ సికింద్రాబాద్లో నివసిస్తున్నరానీ అన్నారు. సోమవారం ఉదయం ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ చెట్టు వద్ద నిల్చొని ట్రైన్ వస్తున్న సమయంలో ఒక్కసారిగా దూకి ఆత్మహత్య పాల్పడ్డాడని తెలిపారు.  ఈ కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేసి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Spread the love