కూతురు పుట్టిన రోజే తండ్రి మృతి

– ఆటో బోల్తా ఒకరు మృతి,  ఐదుగురికి గాయాలు
 నవతెలంగాణ  – నసురుల్లాబాద్
కూతురు పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని, తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా పడి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన బీర్కూర్ మండలంలో చోటుచేసుకుంది. నసురుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన సబ్సిడీ హన్మండ్లు తన కూతురు జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి బంధువులతో కలిసి కుటుంబ సభ్యులతో ఆటోలో మిర్జాపూర్ గ్రామం నుంచి బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం చేరుకున్నారు. కూతురు కృష్ణవేణి. (8). చిన్నారి జన్మదిన వేడుకలు జరుపుకొని ఆ స్వామివారి మొక్కులు తీర్చుకొని తిరిగి ప్రయాణంలో ఘాట్ రోడ్డు వద్ద ఆటో బ్రేక్ ఫెయిల్ అయి, ఆటో బోల్తా పడింది. ఈ ఆటోలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.  వీరిలో హన్మండ్లు తీవ్ర గాయాలకు గురికగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కూతురు పుట్టిన వేడుకలకు వచ్చి కనిపించని లోకానికి వెళ్లిన హన్మండ్లు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ కళ్ళముందే తన తండ్రి, తన  జన్మదినం రోజున ప్రమాదంలో కళ్ళు మూయడంతో ఆ చిన్నారి బోరున వినిపించడం, అక్కడ చూసే వారు కంటతడి పెట్టారు. హన్మండ్లు ప్రభుత్వ  ఉపాధ్యాయుడు  మండలం కిష్టాపూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న హన్మండ్లు చనిపోయిన వార్త తెలుసుకొని పాఠశాలలు  సెలవిచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love