తండ్రైన మంచు మనోజ్‌.. మంచు లక్ష్మి పోస్ట్‌

నవతెలంగాణ- హైదరాబాద్ : మంచు మనోజ్‌ తండ్రి అయ్యారు. ఈ శుభవార్తను మనోజ్‌ సోదరి నటి మంచు లక్ష్మి అధికారికంగా ప్రకటించారు. తన సోదరుడు మనోజ్‌ తండ్రి అయ్యారని.. ఆయన భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు. అంతే కాకుండా అత్త పోలికలతో పుట్టిందంటూ.. అచ్చం తనలానే ఉందంటూ మంచు లక్ష్మీ వేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

”భగవంతుడి ఆశీస్సులతో మా ఇంట చిన్నారి దేవత అడుగుపెట్టింది. మనోజ్‌, మౌనిక ఆనందంగా తమ పాపను ఈ భూమ్మీదకు ఆహ్వానించారు. ఆ పాపను మేము ప్రేమగా ‘ఎంఎం పులి’ అని పిలుస్తున్నాం. ఆ శివుడి ఆశీస్సులు ఈ కుటుంబంపై ఉండాలని, వీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని ‘ఎక్స్‌’లో లక్ష్మి పోస్ట్‌ పెట్టారు. దీనిని మంచు మనోజ్‌ రీపోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పలువురు స్పందిస్తూ వారికి అభినందనలు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మనోజ్‌ – మౌనిక వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ మూవీ కోసం సిద్ధమవుతున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Spread the love