కూతురు చనిపోయిన గంటలోపే తండ్రి మరణం..

– వీరన్న గుట్ట తాండలో విషాదఛాయలు..
నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం వీరన్న గుట్ట తండా కు చెందిన రాథోడ్ లక్ష్మణ్ ( 60) తన కుమార్తె మాలోత్ జ్యోతి (35) ఈనెల 21న పురుగుల మందు సేవి చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం రాత్రి తన కూతురు భోజనం తీసుకు వెళ్తుండగా కళ్యపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గత 15 సంవత్సరాల కిందట అబ్బాపూర్ తాండ కు చెందిన మలావత్ ప్రకాష్ తో వివాహం జరిపించగా, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాల కిందట ప్రకాష్ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు తరచూగా గొడవపడకుతుండడంతో ఈనెల 21న పురుగుల మందు సేవించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చనిపోయిన గంట లోపే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీరు ముందే విలపిస్తున్నారు. వీరన్న గుట్ట తండాలో విషాదం చోటు చేసుకుంది.
Spread the love