కుమార్తెలకు పేమ్రతో నాన్న లేఖలు

Father's letters to daughters with fameజాలాది రత్నసుధీర్‌ సీనియర్‌ రచయిత. అమ్మ చెక్కిన శిల్పం, గెలవాలంటే, స్పర్శ, ప్రక్షాళన, అమ్మ జ్ఞాపకాలు, మనసు పలికిన మనసు కథలు, సెవన్‌ సీక్రెట్స్‌లాంటి పుస్తకాలు రచించారు. అవి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయి. ఇప్పుడు కుమార్తెకు లేఖలు కూడా ఎంతో ప్రయోజనకరమైనవి. ఇదివరకు నెహ్రూ లేఖలు ఎంతో విలువైనవి. సంజీవ్‌దేవ్‌, చలం లాంటి వారి లేఖలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. సినీగీత రచయితగా కూడా జలాది ప్రఖ్యాతులు. 10 అధ్యాయాల్లో ఈ లేఖలు ప్రచురించారు.
భార్య, భర్త ఎలా జీవించాలో చక్కగా రాశారు (పేజీ 117). పూర్వజన్మలు – తిరిగి పుట్టడం, కర్మసిద్ధాంతం, జాతకలు, ఇవన్నీ మత పరమైన నమ్మకాలు అంటారు. లైఫ్‌ ఈజ్‌ ఏ రిపిటేషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ హుడ్‌ అంటారు. అంటే జీవితకాలం బాల్యం పునరావృతం అవుతుంది. 1974లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి, టెల్కోలో ఉద్యోగం సాధించింది సుధామూర్తి. అప్పటికి ఆ సంస్థలో ఆమె ఒక్కతే మహిళా ఉద్యోగి. నేడు ఎమ్‌.పి.గా పార్లమెంట్‌లో ఉంది. మహాప్రస్థాన కర్త శ్రీశ్రీ కుమార్తె జస్టిస్‌ మాలా చెన్నై హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలైంది. తన తండ్రే తనను ప్రోత్సహించారు అన్నారు పై ఇద్దరూ. ఇలా మహిళామూర్తులు గొప్ప వారు ఎలా అయ్యారో తండ్రి ప్రోత్సాహాలు లాంటి ఎందరో ప్రముఖుల జీవితాన్ని తన కుమార్తెకు ప్రేరణ ఇచ్చేలా రాసిన లేఖల సమాహారాన్ని అద్భుతంగా కలర్‌ ఫొటోలతో జాలాది రత్నసుధీర్‌ ముద్రణ చేశారు. ”ప్రేమైక ఉత్తరాల మాలిక” అంటూ గుడిపాటి చక్కటి ముందుమాట రాశారు. ఎ.దినకర్‌బాబు అభిప్రాయం రాశారు. బోధిస్తున్నట్టుగా, ఎన్నో విషయాలు ప్రేమతో కుమార్తెకు తండ్రి సృజనాత్మకంగా, ఆప్యాయంగా రాసిన సృజనాత్మక – వైజ్ఞానిక లేఖా సమాహారం ఈ పుస్తకం. ప్రతి కుమార్తెకు అందాల్సిన పుస్తకం.

– తంగిరాల చక్రవర్తి
9393804472

Spread the love