భయం.. అత్యాశ.. కుట్ర

Fear.. Greed.. Conspiracyహీరో ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘గం..గం.. గణేశా’. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఉదరు శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్‌ కేవీ, కార్తీక్‌ దండు, వినోద్‌ అతిథులుగా పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ వంశీ కారుమంచి మాట్లాడుతూ, ‘టీజర్‌ ఎంత ఎనర్జిటిక్‌గా, కామెడీగా ఉందో మూవీ కూడా అంతే యాక్షన్‌ కామెడీతో ఉంటుంది. ఈ సినిమా ఈ ఇయర్‌ ఆనంద్‌కు సెకండ్‌ సూపర్‌ హిట్‌ అవుతుంది’ అని చెప్పారు. డైరెక్టర్‌ ఉదరు శెట్టి మాట్లాడుతూ, ‘మన లైఫ్‌లో ఏదో ఒక సందర్భంలో క్రేజీ క్యారెక్టర్స్‌ చూస్తుంటాం. అలాంటి క్రేజీ క్యారెక్టర్స్‌ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. వినాయక చవితి చుట్టూ తిరిగే కథ ఇది’ అని తెలిపారు. ‘భయం, అత్యాశ, కుట్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంటుంది. సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఎవరి ప్లాన్స్‌తో వారు ఉంటారు. రేసీ, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లే చూస్తారు’ అని హీరో ఆనంద్‌ దేవరకొండ అన్నారు.

Spread the love