నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జీవో 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ 2026 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. రేపటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని అన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఈవీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్‌పోర్ట్, బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు ఇచ్చామని స్పష్టం చేశారు.