https://navatelangana.com/ Thu, 10 Apr 2025 20:27:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png https://navatelangana.com/ 32 32 ఎదురులేని ఢిల్లీ https://navatelangana.com/unbelievable-delhi/ Thu, 10 Apr 2025 20:27:28 +0000 https://navatelangana.com/?p=543643 Delhi Capitals– 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలుపు
– ఛేదనలో కెఎల్‌ రాహుల్‌ ధనాధన్‌
– బెంగళూర్‌ 163/7, ఢిల్లీ 169/4
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు లేదు. ఐపీఎల్‌18లో క్యాపిటల్స్‌ వరుసగా నాల్గో మ్యాచ్‌లో విజయం సాధించి, అజేయ జోరు కొనసాగిస్తోంది. కెఎల్‌ రాహుల్‌ (93 నాటౌట్‌), స్టబ్స్‌ (38 నాటౌట్‌) మెరుపులతో 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.5 ఓవర్లలోనే ముగించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు చిన్నస్వామిలో ఇది వరుసగా రెండో ఓటమి.
నవతెలంగాణ-బెంగళూర్‌
కెఎల్‌ రాహుల్‌ (93 నాటౌట్‌, 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగిన కెఎల్‌ రాహుల్‌ అదరగొట్టాడు. పవర్‌ప్లేలోనే డుప్లెసిస్‌ (2), జేక్‌ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (7), అభిషేక్‌ పోరెల్‌ (7) సహా కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (15) ఆరంభంలోనే అవుటయ్యారు. 58/4తో ఒత్తిడిలో కూరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెఎల్‌ రాహుల్‌ ఒక్కడై ఆదుకున్నాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (38 నాటౌట్‌, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) జతగా ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు షాక్‌ ఇచ్చాడు. 55 బంతుల్లోనే 111 పరుగులు పిండుకున్న రాహుల్‌, స్టబ్స్‌ మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. మిడిల్‌ ఓవర్లలో బెంగళూర్‌ బౌలర్లు లయ తప్పటంతో.. రాహుల్‌, స్టబ్స్‌ స్వేచ్ఛగా ఆడారు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన రాహుల్‌… ఆ తర్వాత టాప్‌ గేర్‌లోకి వచ్చాడు. మరో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో స్టబ్స్‌ సైతం చక్కటి సహకారం అందించాడు. దీంతో 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌18లో నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నాల్గో విజయం కాగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఛేదనలో అజేయ అర్థ సెంచరీ సాధించిన కెఎల్‌ రాహుల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
కుల్దీప్‌ మాయజాలం :
తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూర్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులే చేసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (2/17) మాయ చేయగా.. విప్‌రాజ్‌ (2/18), మోహిత్‌ శర్మ (1/10) రాణించారు. టాప్‌ ఆర్డర్‌లో ఫిల్‌ సాల్ట్‌ (37), విరాట్‌ కోహ్లి (22) ధనాధన్‌ ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత ఆర్‌సీబీ దూకుడు తగ్గింది. పడిక్కల్‌ (1), లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (3) నిరాశపరిచారు. పాటిదార్‌ (25), కృనాల్‌ (18) సహా టిమ్‌ డెవిడ్‌ (37 నాటౌట్‌) రాణించటంతో బెంగళూర్‌ 163 పరుగులైనా చేయగల్గింది.
IPL

]]>
సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని https://navatelangana.com/dhoni-as-the-captain-of-superkings/ Thu, 10 Apr 2025 20:24:18 +0000 https://navatelangana.com/?p=543640 MS Dhoni– గాయంతో సీజన్‌కు రుతురాజ్‌ దూరం
– సిఎస్‌కె చీఫ్‌ కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌
చెన్నై: దిగ్గజ క్రికెటర్‌, కెప్టెన్‌ కూల్‌ ఎం.ఎస్‌ ధోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టనున్నాడు. ఐపీఎల్‌18లో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఎం.ఎస్‌ ధోని తీసుకోనున్నట్టు ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌ గురువారం వెల్లడించారు. సూపర్‌కింగ్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌, ఫామ్‌లో ఉన్న కీలక బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో సీజన్‌కు దూరం అయ్యాడు.
‘రుతురాజ్‌ గైక్వాడ్‌ సీజన్‌కు దూరమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో గువహటిలో రుతురాజ్‌ గాయానికి గురయ్యాడు. నొప్పితో బాధపడుతున్న రుతురాజ్‌కు ఎల్బోలో ఎయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ అయ్యిందని ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలింది’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. చెపాక్‌ వేదికగా నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫ్లెమింగ్‌.. జట్టులోని అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడిని కొత్త కెప్టెన్‌గా ప్రకటించాడు. ‘మా జట్టులో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ ఎం.ఎస్‌ ధోని ఉన్నాడు. ఐపీఎల్‌18లో మిగిలిన మ్యాచులకు అతడు సారథ్యం వహిస్తాడు. ప్రస్తుత పరిస్థితిని ధోని అర్థం చేసుకున్నాడు. సారథ్య పగ్గాలు అందుకునేందుకు ఏమాత్రం వెనుకాడలేదు’ అని ఫ్లెమింగ్‌ అన్నాడు. సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగింట పరాజయం పాలైంది.

]]>
351 మెడల్‌ ఈవెంట్లతో..! https://navatelangana.com/with-351-medal-events/ Thu, 10 Apr 2025 20:22:42 +0000 https://navatelangana.com/?p=543638 Olympics– 2028 ఒలింపిక్స్‌లో 31 స్పోర్ట్స్‌
లసానె (స్విట్జర్లాండ్‌): విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో లింగ సమానత్వం ప్రస్ఫుటించేలా స్పోర్ట్స్‌ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తుది ఆమోదం తెలిపింది. 2028 ఒలింపిక్స్‌కు అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరం ఆతిథ్యం ఇవ్వనుండగా కొత్తగా చేర్చిన ఐదు క్రీడాంశాలతో కలిపి ఓవరాల్‌గా 31 స్పోర్ట్స్‌లో పతక పోటీలు నిర్వహించనున్నారు. 351 పసిడి పతక ఈవెంట్లు లాస్‌ ఏంజిల్స్‌ నిర్వహించనుండగా.. 10500 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇందులో 5333 మహిళా, 5167 పరుష అథ్లెట్లు పోటీలో నిలువనున్నారు. లాస్‌ఏంజిల్స్‌ నిర్వహణ కమిటీ ప్రతిపాదనలతో కొత్తగా మహిళా క్రీడాకారులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక ఒలింపిక్స్‌లో దాదాపుగా అన్ని ఈవెంట్లలోనూ మెన్స్‌ జట్లతో సమానంగా ఉమెన్‌ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఫుట్‌బాట్‌లో పురుషుల జట్లు 12 మాత్రమే ఆడనుండగా.. మహిళల విభాగంలో 16 జట్లు పోటీపడనున్నాయి.
క్రికెట్‌లో ఆరు జట్లు : లాస్‌ ఏంజిల్స్‌లో క్రికెట్‌ ప్రవేశపెట్టగా.. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీపడనున్నాయి. ఒలింపిక్స్‌లో పోటీపడే జట్ల అర్హత ప్రక్రియపై ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఐసీసీ ర్యాంకింగ్స్‌ లేదా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టాప్‌-6లో నిలిచిన జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. బాక్సింగ్‌ను సైతం అధికారికంగా ఒలింపిక్‌ ప్రొగ్రామ్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.

]]>
సింధు పరాజయం https://navatelangana.com/indus-defeat/ Thu, 10 Apr 2025 20:20:16 +0000 https://navatelangana.com/?p=543634 Sindhu's defeat– యమగూచి చేతిలో ఓటమి
– ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2025
నిగ్బో (చైనా): ఈ ఏడాదిలో భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారుల పేలవ ఫామ్‌ కొనసాగుతుంది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ నుంచి ఇప్పటికే లక్ష్యసేన్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు పరాజయం పాలవగా.. తాజాగా డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పి.వి సింధు సైతం నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పి.వి సింధు వరుస గేముల్లో నిరాశపరిచింది. మూడో సీడ్‌, జపాన్‌ స్టార్‌ అకానె యమగూచి 21-12, 16-21, 21-16తో మూడు గేముల మ్యాచ్‌లో సింధుపై విజయం సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో తడబాటుకు లోనైనా.. రెండో గేమ్‌లో గొప్పగా పుంజుకుంది. 21-16తో రెండో గేమ్‌ సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. కానీ చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో సింధు మళ్లీ వెనుకంజ వేసింది. యమగూచి సూపర్‌ గేమ్‌ ముంగిట తలొంచింది. దీంతో ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు పోరాటానికి తెరపడింది. ఈ సీజన్‌లో సింధు అంచనాలను అందుకోవటం లేదు. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరిన సింధు.. ఇండోనేషియా మాస్టర్స్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌, స్విస్‌ ఓపన్‌లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది.
పి.వి సింధు ఓటమితో సింగిల్స్‌ విభాగంలో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేట ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజావత్‌లు రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ప్రియాన్షు రజావత్‌ 14-21, 17-21తో వరల్డ్‌ నం.7 నరొక (జపాన్‌) చేతిలో ఓటమి పాలవగా.. కిరణ్‌ జార్జ్‌ 21-19, 13-21, 16-21తో వరల్డ్‌ నం.5 కునాల్‌విట్‌ (థారులాండ్‌) చేతిలో పరాజయం చెందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. 12-21, 21-16, 21-18తో ఐదో సీడ్‌ చైనీస్‌ తైపీ జోడీపై అలవోక విజయం సాధించారు.

]]>
జకోవిచ్‌కు షాక్‌ https://navatelangana.com/shock-to-djokovic/ Thu, 10 Apr 2025 20:18:42 +0000 https://navatelangana.com/?p=543633 Shock for Djokovic– చిలీ ఆటగాడి చేతిలో చిత్తు
– మోంటోకార్లో మాస్టర్స్‌ టెన్నిస్‌
రోక్యూబృనే కాప్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌): టెన్నిస్‌ దిగ్గజం, సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. మోంటోకార్లో మాస్టర్స్‌ ఏటీపీ 1000 టోర్నమెంట్‌లో నొవాక్‌ జకోవిచ్‌ రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జకోవిచ్‌ గురువారం జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో ఓటమి చెందాడు. 27 ఏండ్ల యువ చిలీ ఆటగాడు అలెగ్జాండ్రో తబిలో 6-3, 6-4తో జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. రెండు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన అలెగ్జాండ్రో..24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేతను మట్టికరిపించాడు. జకోవిచ్‌ మూడు ఏస్‌లు కొట్టినా.. ఒక్క బ్రేక్‌ పాయింట్‌తోనే సరిపెట్టుకున్నాడు. పాయింట్ల పరంగా 66-49తో తబిలో ఆధిపత్యం నిరూపించుకుని ముందంజ వేశాడు. రష్యా స్టార్‌, తొమ్మిదో సీడ్‌ డానిల్‌ మెద్వదేవ్‌ 7-6(8-6), 5-7, 6-2తో అలెగ్జాండ్ర ముల్లర్‌పై విజయం సాధఙంచాడు. ఏడు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెద్వదేవ్‌ మూడు సెట్ల మ్యాచ్‌లో మెప్పించాడు. గ్రిగర్‌ దిమిత్రోవ్‌ 4-6, 6-3, 6-1తో వాలెంటిన్‌పై గెలుపొందగా.. నాల్గో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 6-2, 6-1తో రాబర్టో బటిస్టాపై అలవోక విజయం నమోదు చేశాడు. రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ 6-3, 6-1తో డానియల్‌ను మట్టికరిపించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. లొరెంజో ముసెటి 6-3, 6-3తో సహచర ఆటగాడు మాటో బెరాటినిపై సాధికారిక విజయం సాధించాడు. మూడు బ్రేక్‌ పాయింట్లతో అదరగొట్టిన ముసెటి.. మెరుపు విజయంతో క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ : 45 ఏండ్ల వయసులో అదిరే విజయాలు సాధిస్తూ ఏటీపీ రికార్డు పుస్తకాలను తిరగరాస్తున్న భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న మోంటోకార్లో మాస్టర్స్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఇటలీ ఆటగాళ్లు సిమెనె, ఆండ్రీవలపై బెన్‌ షెల్టన్‌ (అమెరికా)తో కలిసి 2-6, 7-6(7-4), 10-7తో రోహన్‌ బోపన్న విజయం సాధించాడు.

]]>
పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తాం https://navatelangana.com/we-will-recognize-the-country-of-palestine/ Thu, 10 Apr 2025 20:15:11 +0000 https://navatelangana.com/?p=543628 We will recognize the state of Palestine.– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌
పారిస్‌: పాలస్తీనా దేశాన్ని జూన్‌లో గుర్తిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ చెప్పారు. ఇందుకు ప్రతిగా మధ్య ప్రాచ్యంలోని కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌ను గుర్తించగలవన్నారు. పాలస్తీనాను సార్వభౌమాధికార దేశంగా దాదాపు 150 దేశాలు గుర్తించినా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ వంటి ప్రధాన పశ్చిమ దేశాలు ఇప్పటివరకు గుర్తించలేదు. ”పాలస్తీనా దేశాన్ని గుర్తించే దిశగా మేం ముందుకు సాగాల్సిన అవసరం వుంది. బహుశా కొద్ది నెలల్లో అది జరగవచ్చు, ఎవరినో బుజ్జగించడానికి నేను ఇది చేయడం లేదు. ఒక దశలో ఇది సరైందని భావిస్తున్నందున ఈ చర్య తీసుకుంటున్నాం.” అని ఫ్రాన్స్‌ 5 టెలివిజన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా మాక్రాన్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనాను ఎవరైతే సమర్ధిస్తారో వారు కూడా అందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌ను గుర్తించాలని సూచించారు. కానీ వారిలో చాలామంది అలా చేయడం లేదన్నారు. ఇజ్రాయిల్‌ను గుర్తించని దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, యెమెన్‌ వంటి దేశాలు వున్నాయి. సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగే సమావేశంలో జూన్‌లో తమ లక్ష్య సాధన దిశగా అడుగులు పడతాయని మాక్రాన్‌ పేర్కొన్నారు.

]]>
ఆర్టీఐ చట్టాన్ని నాశనం చేసే డీపీడీపీ యాక్ట్‌ https://navatelangana.com/dpdp-act-which-destroys-rti-law/ Thu, 10 Apr 2025 20:13:13 +0000 https://navatelangana.com/?p=543625 RTI– తక్షణమే రద్దు చేయాలన్న ఇండియా బ్లాక్‌
న్యూఢిల్లీ: డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (డీపీడీపీ) లోని సెక్షన్‌ 44(3) సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ని నాశనం చేస్తుందని ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ గురువారం విమర్శించింది. తక్షణమే దాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్‌ చేసింది. ఇక్కడ జరిగిన సంయుక్త పత్రికా సమావేశంలో కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గగోరు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సహా ఇండియా బ్లాక్‌ పార్టీలకు చెందిన 120మందికి పైగా ఎంపీలు ఈ సెక్షన్‌ రద్దు చేయాలని కోరుతూ సంయుక్త మెమోరాండంపై సంతకాలు చేశారన్నారు. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మెమోరాండాన్ని అందచేయనున్నట్లు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో ఎం.ఎం.అబ్దుల్లా (డీఎంకే), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), జాన్‌ బ్రిట్టాస్‌ (సీపీఐ(ఎం), జావేద్‌ అలీ ఖాన్‌(ఎస్‌పీ), నావల్‌ కిషోర్‌(ఆర్‌జేడీ)లు పాల్గొన్నారు. పౌర హక్కుల కార్యకర్తలు కూడా ఈ సెక్షన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సెక్షన్‌ 44(3)ని ఆర్‌టిఐ చట్టం, 2005లోని సెక్షన్‌ 8(1)(జె)కి ప్రత్యామ్నాయంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని గగోరు తెలిపారు. వ్యక్తిగత సమాచారమేదైనా దాన్ని వెల్లడించడం ప్రజా కార్యకలాపాలకు గానీ లేదా ప్రజా ప్రయోజనాలకు గానీ సంబంధం లేదని భావించినా, లేదా గోప్యతపై అనవసరపు దాడి చేస్తుందని భావించినా సదరు సమాచారాన్ని నిలిపివేయడానికి ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(జె) అనుమతిస్తుంది. అయితే ఈ ఆంక్ష లేదా పరిమితి విధించడమనేది ఒక ముఖ్యమైన అంశానికి లోబడి వుంటుంది. ఇలా వెల్లడించిన సమాచారానికి విస్తృత ప్రజా ప్రయోజనాలు వున్నాయని కేంద్ర పౌర సమాచార అధికారి, రాష్ట్ర పౌర సమాచార అధికారి లేదా అప్పిలేట్‌ అధారిటీ నిర్ణయించినట్లైతే దీన్ని అందుబాటులో వుంచుతారు.
డీపీడీపీ చట్టంలోని సెక్షన్‌ 44(3), ఆర్టీఐ చట్టంలోని సెక్షణ్‌ 8(1)(జె)ని సవరిస్తుంది. ఇది, ప్రజా ప్రయోజనాలు లేదా మరే ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వ సంస్థలు వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని దాచడానికి అనుమతిస్తుంది.

]]>
సమస్యను కోరి తెచ్చుకున్నారు https://navatelangana.com/the-problem-was-sought/ Thu, 10 Apr 2025 20:11:04 +0000 https://navatelangana.com/?p=543622 Allahabad High Courtలైంగికదాడి కేసులో నిందితుడికి బెయిల్‌
– అలహాబాద్‌ హైకోర్టు తీర్పు మహిళాసంఘాల ఆగ్రహం
న్యూఢిల్లీ : లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు, బాధితురాలు తనకు తానుగా సమస్యను కోరి తెచ్చుకుందని వ్యాఖ్యానించింది. పైగా ఈ ఘటనలో ఆమె బాద్యత కూడా వుందని పేర్కొంది. మాస్టర్స్‌ చదువుతున్న బాధితురాలు గత సెప్టెంబరులో తన స్నేహితులతో కలిసి బార్‌కు వెళ్ళింది. అక్కడ అందరూ కలిసి తాగారు. దాంతో ఆమెకు ఇంటికి వెళ్ళడానికి మరొకరి సాయం అవసరమైంది. ఈ విషయాలన్నీ ఆమె తన ఎఫ్‌ఐఆర్‌లోనే పేర్కొంది. నిందితుడి ఇంటికి రెస్ట్‌ తీసుకునేందుకు వెళ్ళడానికి కూడా అంగీకరించినట్టు ఆమె తెలిపింది. అయితే దారిలో వెళుతుండగానే నిందితుడు తనను అనుచితంగా తాకాడని, వాళ్ళ ఇంటికి కాకుండా వారి బంధువుల ఇంటికి తీసుకెళ్ళారని అక్కడ రెండుసార్లు తనపై అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది. కాగా బాధితురాలు వెల్లడించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఇది లైంగికదాడి కేసుగా కాకుండా ఇరువురి మధ్య ఆమోదయోగ్యంతో జరిగిన లైంగిక చర్యగా పరిగణించి తనకు బెయిల్‌ ఇప్పించాలని నిందితుడు పిటిషన్‌ పెట్టుకున్నాడు. ఎలాంటి నేరపూరితమైన చరిత్ర లేని తన క్లయింట్‌ గతేడాది డిసెంబరు నుంచి జైల్లో వున్నాడని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ సంజరు కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని బెంచ్‌, మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలు తన చర్యల్లోని నైతికత, ప్రాముఖ్యత గురించి అర్ధం చేసుకోగలదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. బాధితురాలు చెప్పేదే నిజమని భావించినట్లైతే ఆమె తనకు తానుగా సమస్యను ఆహ్వానించిందని భావించాల్సి వస్తుందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతోందని కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఆమెకు చేసిన వైద్య పరీక్షలను బట్టి చూసినట్లైతే లైంగిక చర్య జరిగినట్లు తెలుస్తోంది కానీ అది లైంగిక దాడి అనే అభిప్రాయాన్ని డాక్టర్‌ చెప్పలేదని కోర్టు పేర్కొంది.

]]>
కంచ గచ్చిబౌలి భూములపై కేంద్రప్రభుత్వం విచారణ https://navatelangana.com/the-central-government-inquiry-into-the-lands-of-kancha-gachibowli/ Thu, 10 Apr 2025 20:09:16 +0000 https://navatelangana.com/?p=543621 – ప్రభుత్వం తరపున నివేదిక సమర్పించిన సీఎస్‌
– బీఆర్‌ఎస్‌, బీజేపీ, హెచ్‌సీయూ విద్యార్థుల నుంచి వివరాల సేకరణ
– నేడూ క్షేత్ర స్థాయిలో పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ గురువారం వరుస భేటీలు నిర్వహించింది. కమిటీ చైర్మెన్‌ సిద్ధాంత దాస్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంది. ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌ రెడ్డి, డీజీపీ జితేందర్‌, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో భేటీ అయింది.
3గంటలపాటు జరిగిన సమావేశం 400 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను కమిటీకి ప్రభుత్వం సమర్పించింది. అనంతరం ఎంసీహెచ్‌ఆర్‌డీలో విద్యార్థి సంఘాల నేతలతో భేటీ అయ్యింది. వారి నుంచి వివరాలు సేకరించింది. బీఆర్‌ఎస్‌ నేతలతో భేటీ అయింది. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం భూములకు సంబంధించి వ్యవహారంపై కమిటీకి నివేదిక ఇచ్చింది. హెచ్‌సీయూ పాలకవర్గం, బీజేపీ ఎంపీలతో కమిటీ భేటీ అయింది. వారి నుంచి భూములకు సంబంధించిన వివరాలను సేకరించింది.
నేడూ క్షేత్ర స్థాయిలో పర్యటన
సాధికారిక కమిటీ శుక్రవారం కూడా వివిధ సంఘాలు, నేతలు, స్వచ్ఛంద సంస్థలతో భేటీ కానుంది. అనంతరం వివిధ వర్గాలనుంచి సేకరించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. టీజీఐఐసీ ఈ భూములను చదును చేపట్టిన నేపథ్యంలో .. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి.. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.

]]>
యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌ https://navatelangana.com/young-india-is-my-brand/ Thu, 10 Apr 2025 20:06:09 +0000 https://navatelangana.com/?p=543616 Young India Skills University, CM Revanth Reddy– దేశంలోనే బెస్ట్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాం
– మహాత్ముడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఏర్పాటు
– విద్య, ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యత
– ప్రతి నియోజకవర్గంలోనూ 25 ఎకరాల్లో పోలీస్‌ స్కూల్స్‌
– ప్రభుత్వ బడుల్లోనూ మార్పులు
– సామాజిక బాధ్యతగా ప్రయివేటు కంపెనీలు సాయమందించాలి
– చరిత్రను మలుపు తిప్పిన కొంతమంది సీఎంల నిర్ణయాలు : మంచిరేవులలో యంగ్‌ఇండియా పోలీస్‌స్కూల్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
– పిల్లలతో కలిసి కొద్దిసేపు ఆటలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
”దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉంది. దీని దృష్ట్యా విద్యా, ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దేశంలోనే ది బెస్ట్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇదే నా బ్రాండ్‌” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్‌ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్‌ చేసుకున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో గురువారం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆనాడు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. వచ్చే ఒలంపిక్స్‌ లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. ప్రతి నియోజక వర్గంలోనూ 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తామన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో సంఖ్య తగ్గుతోందన్నారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్‌ విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ-స్కూల్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సైనిక్‌ స్కూల్‌కు దీటుగా పోలీస్‌ స్కూల్‌ను తీర్చిదిద్దాలని, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీస్‌ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని, సామాజిక బాధ్యతగా ప్రయివేట్‌ కంపెనీలు పోలీస్‌ స్కూల్‌కు ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలీస్‌ స్కూల్‌ కోసం రూ.100 కోట్ల కార్పస్‌ ఫండ్‌ క్రియేట్‌ చేసుకోవాలని, ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అనంతరం సీఎం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌లో స్టాఫ్‌ రూమ్స్‌, తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ను సందర్శించి, చిన్నారులతో కాసేపు ఫుట్‌బాల్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, దయానంద్‌, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, కాలే యాదయ్య, అనిల్‌రెడ్డి, యంగ్‌ ఇండియా స్కూల్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ సివి.ఆనంద్‌, ఉన్నతాధికారులు, యంగ్‌ ఇండియా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మలుపు తిప్పిన నిర్ణయాలు..
దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్‌ ఉందని చెప్పుకుంటున్నారని తెలిపారు. కిలో రెండు రూపాయల బియ్యంతో ఎన్టీఆర్‌ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్నారని అన్నారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని తెలిపారు. ”16 నెలలైనా బ్రాండ్‌ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. అందుకే ఇవాళ నేను క్రియేట్‌ చేసిన నా బ్రాండ్‌ ‘యంగ్‌ ఇండియా’లో చదువు, ఉపాధి నా బ్రాండ్‌” అని అన్నారు. ఆనంద్‌ మహేంద్రను యూనివర్సిటీకి చైర్మెన్‌గా నియమించుకున్నామని తెలిపారు. ఇందులో చేరిన ప్రతి విద్యార్థికీ ఉద్యోగ భద్రత ఉందన్నారు.
అప్రమత్తంగా ఉండాలి: వర్షాలపై అధికారులకు సీఎం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
ఫూలే మార్గం అందరికీ ఆచరణీయం : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
– త్యాగాలు, సమాజానికి చేసిన సేవల స్మరణ
– నేడు ఆయన జయంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిరావు ఫూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్‌11) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఫూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదనీ, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియడారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిభా ఫూలే పేరు పెట్టి ప్రజాభవన్‌గా మార్చినట్టు తెలిపారు. ఫూలే స్ఫూర్తితోనే అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి అవకాశాలు అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్టు తెలిపారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళా శక్తి పాలసీ ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, వారి పేరిట పెట్రోల్‌ బంకుల ఏర్పాటు, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల కేటాయింపు, ఆర్టీసీకి అద్దె బస్సులు ఇలా ప్రతి రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఇప్పటికే అమలు చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు కూడా మహిళల పేరుతోనే ఇస్తున్నట్టు చెప్పారు.

]]>
వెనుకడుగు వెనుక.. https://navatelangana.com/behind-the-back/ Thu, 10 Apr 2025 20:03:25 +0000 https://navatelangana.com/?p=543609 Trump– ట్రంప్‌పై కార్పొరేట్ల ఒత్తిడి..మాంద్యం భయాల ఎఫెక్ట్‌
– 90 రోజుల పాటు సుంకాలకు విరామం
– చైనాపై మాత్రం 145 శాతానికి పెంపు
– యూఎస్‌ అధ్యక్షుడిపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు
– మేం చైనీయులం.. రెచ్చగొడితే భయపడం : చైనా విదేశాంగ శాఖ
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్టుండి ప్రపంచ దేశాలపై వేస్తున్న సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విరామానికి ప్రధాన కారణం పెట్టుబడిదారులని రిపోర్టులు వస్తున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 104 శాతం నుంచి 145 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్‌ గురువారం ప్రకటించారు. ట్రంప్‌ టారిఫ్‌లు ఏప్రిల్‌ 9 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. చివరి నిమిషంలో ట్రంప్‌ వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌పై సుంకాలు విధించిన తర్వాత, గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం, మాంద్యం ముప్పు కారణంగా ట్రంప్‌ తన నిర్ణయంపై వెనక్కి తగ్గారని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎవరెన్ని చెప్పినా వెనక్క్కి తగ్గనని చెప్పిన ట్రంప్‌, చివరి నిమిషంలో టారిఫ్‌లకు బ్రేక్‌ వేయడం విశేషం.పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల నుంచి ట్రంప్‌నకు తీవ్రమైన నిరసన, ఒత్తిడి ఎదురైంది. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ద్వారా స్వయంకృతాపరాధం అవుతుందని, తాను తీసిన గోతిలో తానే పడడం వంటిదని చాలా మంది నిపుణులు హెచ్చరించారు. అమెరికాలో మరో ఆర్థిక మాంద్యానికి ట్రంప్‌ కారణమవుతున్నారని పరిశోధన సంస్థలు విశ్లేషించాయి. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ఆర్థిక అణు యుద్ధంతో సమానమని పేర్కొన్నాయి. దాని పరిణామాలను అమెరికానే ఎక్కువగా భరించాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఈ పరిణామాలకు మరోవైపు ప్రపంచ దేశాలపై ఆయన పెంచుకున్న అహం (ఇగో) కూడా తగ్గడంతో టారిఫ్‌లపై వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అయితే చైనా మాత్రం దీటుగా నిలబడటంతో ట్రంప్‌ ఆ దేశంపై సుంకాలకు సంబంధించి వెనక్కి తగ్గలేదు. చాలా వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రతీకార సుంకాలు వేయకుండా చర్చల కోసం తమను సంప్రదించడంతో తాత్కాలికంగా సుంకాల చర్యలను నిలిపివేశామన్నారు.
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌..
అధిక టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించే ముందు సోషల్‌ మీడియాలో తన కంపెనీ షేర్లకు డిమాండ్‌ వచ్చేలా పోస్టులు పెట్టారు. అంతా సక్రమంగా జరుగుతుందని.. అమెరికా ఇంతకుముందుతో పోలిస్తే మరింత మెరుగ్గా రాణిస్తుందని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. కాసేపటి తర్వాత కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమంటూ.. చివర్లో డీజేటీ అని జోడించారు. ట్రంప్‌నకు చెందిన మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ కార్పొరేషన్‌ను డీజేటీగా పిలుస్తారు. అనంతరం మార్కెట్లు భారీగా పెరగడం, ఆయన కంపెనీ షేర్లు కూడా ర్యాలీ చేశాయి. దీనిపై ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని లేదా మార్కెట్‌ అవతవకలకు పాల్పడ్డారంటూ డెమోక్రట్లు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
మేం చైనీయులం..రెచ్చగొడితే భయపడం : చైనా విదేశాంగ శాఖ
బీజింగ్‌: చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలను ప్రకటించాక.. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు చేశారు. ‘మేం చైనీయులం. కవ్వింపు చర్యలకు భయపడం. టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గం’ అని పేర్కొన్నారు. దీనికి ఆమె 1953 నాటి వీడియోను పంచుకున్నారు. నాడు కొరియా యుద్ధం నేపథ్యంలో డ్రాగన్‌ నాయకుడు మావో జెడాంగ్‌ ప్రసంగించిన వీడియో అది. అందులో ‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మేము నిర్న యించలేం.. అది వాళ్ల (అమెరికా) ఇష్టం. ఇది ఎంతకాలం సాగినా మేము వెనక్కి తగ్గం. పూర్తిగా విజయం సాధించేవరకు పోరాడతాం’ అని జెడాంగ్‌ పేర్కొన్నారు.

]]>
సిలిండర్‌ ధర పెంపుతో ప్రజలపై రూ.3700 కోట్ల భారం https://navatelangana.com/rs-3700-crore-on-people-with-cylinder-price-hike/ Thu, 10 Apr 2025 19:58:13 +0000 https://navatelangana.com/?p=543612 Cylinder price, CPI(M)– పెట్రోలియం ఉత్పత్తులపై సర్‌చార్జీతో సర్కారు రూ. 37వేల కోట్లు వసూలు
– ధరల పెంపు సొమ్మును కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ
– గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌
– బీజేపీ ప్రభుత్వ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి : రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ
– ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కట్టెల పొయ్యి, గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన
– రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచి ప్రజలపై రూ.3700 కోట్ల భారం వేసిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్‌ విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులపై సర్కారు రూ.37వేల కోట్ల స్పెషల్‌ సర్‌చార్జీ వేసిందని వివరించారు. పెంచిన వంట గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో కట్టెల పొయ్యి, గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి నిరసన చేపట్టారు. ”మోడీ హయాంలో గ్యాస్‌ బండ పేదల పాలిట గుదిబండ.. పెంచిన వంట గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.. పేదలపై భారాలు.. కార్పొరేట్లకు వరాలా..? వంటగ్యాస్‌ ధరలు పెంచిన మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి..” అని నినాదాలిచ్చారు. కార్యక్రమానికి పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంపుతోపాటు పెట్రోల్‌ ఉత్పత్తులపై ప్రత్యేక సర్‌చార్జీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి.. ఆ సొమ్మును కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతోందన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు పేదలను కొట్టి.. గద్దలకు వేసినట్టుగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ సర్కారు అధికారంలోకి రాకముందు రూ.380 ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.905కు పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. మోడీ పాలనలో గ్రామీణ ప్రాంతంలో ‘ఉపాధి’ దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఒకవైపు తమ కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలను కొనసాగిస్తూ.. ప్రజలను మతతత్వంతో విడదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివార్‌ శక్తులు మతఘర్షణలు సృష్టించి ప్రజల మధ్య అనైక్యతను పెంచుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాయన్నారు. ప్రజలందరూ బీజేపీ కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి మాట్లాడుతూ.. బీపీఎల్‌ కుటుంబాలకు దీపం, ఉజ్వల పథకాల ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారని, కానీ వాటిపైనా ధరల భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం పెరుగుతున్న ధరల వల్ల సిలిండర్లు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో పేదలకు రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నందున.. ఇప్పుడు ధర పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపైనా అధిక భారం పడుతుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా గ్యాస్‌ ధరలపై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, డిజి.నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.దశరథ్‌, కె.నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేశ్‌, జె.కుమారస్వామి, ఎన్‌.మారన్న, జి.నరేష్‌ పాల్గొన్నారు.
జిల్లాల్లో..
వంట గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్‌ సదన్‌ సంతోష్‌ నగర్‌ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్‌ మాట్లాడుతూ.. భారత్‌ ఎగుమతులపై ట్రంప్‌ పన్నులు వేస్తుంటే నోరు మెదపడానికి ధైర్యం చేయని మోడీ.. దేశంలో మాత్రం ప్రజలపై ధరల పెంచుతూ దాడి చేస్తున్నారని విమర్శించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి చౌరస్తాలో ధర్నా చేశారు.
మహబూబాబాద్‌ జిల్లాలో రోడ్డుపై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేసముద్రం మండల కేంద్రంలోని ఇంటికన్నె గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. బచ్చన్నపేట మండలంలో జనగామ-సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రోడ్డులో నిరసన చేపట్టారు. మలుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో గ్యాస్‌ సిలిండర్‌ నెత్తిన పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్లో ఖాళీ సిలిండర్లను, కట్టెల పొయ్యిని వెలిగించారు. గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ చౌరస్తా, వెంకటాపురం గ్రామంలో, ధరూర్‌ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వీపనగండ్ల, చిన్నంబాయి మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో ఉపాధి పనుల ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని బిజినపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. బల్మూరు మండల వ్యాప్తంగా ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్‌ బస్టాండ్‌ సెంటర్లో ఖాళీ సిలిండర్‌తో నిరసన కార్యక్రమం చేపట్టారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బస్టాండ్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ సదాశివపల్లిలో సిలిండర్లు ఎత్తుకుని నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో గ్యాస్‌ బండ, కట్టెల పొయ్యితో నిరసన తెలిపారు. నిర్మల్‌లో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం ముందు కట్టెల పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. ఖానాపూర్‌లోనూ సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ ఆధ్వర్యంలో కొమురం భీమ్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నస్పూర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్‌లో రాస్తారోకో నిర్వహించారు. తాండూర్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో గ్యాస్‌బండ, పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప, చండూరు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. భువనగిరి పట్టణంలో బహార్‌ పేట్‌ 26వ వార్డు, సింగన్నగూడెం 9వ వార్డులో ప్రజలు నిరసన తెలిపారు. ఐద్వా ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి బస్టాండ్‌ ఎదుట నేషనల్‌ హైవేపై సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు తాండూర్‌లో పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్‌ చౌరస్తాలో సీపీఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంతోపాటు నాగిళ అంబేద్కర్‌ చౌరస్తాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండర్లతో మహిళలు నిరసన తెలిపారు.

]]>