https://navatelangana.com/ Sat, 27 Apr 2024 09:22:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png https://navatelangana.com/ 32 32 హేమంత్‌ సోరెన్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు..! https://navatelangana.com/court-denied-bail-to-hemant-soren%e0%b0%b9%e0%b1%87%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8du200c-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8du200c%e0%b0%95%e0%b1%81-%e0%b0%ac%e0%b1%86%e0%b0%af/ Sat, 27 Apr 2024 09:22:24 +0000 https://navatelangana.com/?p=278357 నవతెలంగాణ-హైదరాబాద్  : భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసేందుకు రాంచిలోని ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌’ కు సంబంధించిన ప్రత్యేక కోర్టు నిరాకరించింది. హేమంత్‌ సోరెన్‌.. తన మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 13 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ రాంచి కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది.

]]>
ప్రొఫెసర్ కోదండరాం ఆశీర్వాదం తీసుకున్న తీన్నార్ మల్లన్న https://navatelangana.com/tinnar-mallanna-who-took-the-blessings-of-professor-kodandaram/ Sat, 27 Apr 2024 09:15:01 +0000 https://navatelangana.com/?p=278352 నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్నార్ మల్లన్న ప్రొఫెసర్ కొదండరాం ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఈ సందర్బంగా ఆయన్ను శాలువాతో సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తీన్నార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

]]>
హెలికాప్ట‌ర్‌ కూర్చోబోయి.. జారిప‌డ్డ బెంగాల్ సీఎం.. https://navatelangana.com/the-bengal-cm-slipped-while-sitting-in-the-helicopter/ Sat, 27 Apr 2024 09:01:28 +0000 https://navatelangana.com/?p=278344

#WATCH | West Bengal CM Mamata Banerjee slipped and fell while taking a seat after boarding her helicopter in Durgapur, Paschim Bardhaman today. She reportedly suffered a minor injury and was helped by her security personnel. She continued with her onward travel to Asansol. pic.twitter.com/UCt3dBmpTQ

— ANI (@ANI) April 27, 2024

నవతెలంగాణ – ప‌శ్చిమ బెంగాల్ : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. హెలికాప్ట‌ర్ సీటులో కూర్చోబోయి కింద‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ్ బ‌ర్ద‌మాన్ జిల్లాలోని దుర్గాపూర్ వ‌ద్ద జ‌రిగింది. హెలికాప్ట‌ర్‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌ సీటులో కూర్చోబోయే క్ష‌ణంలో మ‌మ‌తా బెన‌ర్జీ తుళ్లిప‌డ్డారు. ఆమెకు స్వ‌ల్ప‌స్థాయిలో గాయాలు అయ్యాయి. సెక్యూర్టీ సిబ్బంది ఆమెను వెంట‌నే పైకి లేపారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొనేందుకు ఆమె అస‌న్‌సోల్ బ‌య‌లుదేరి వెళ్లారు.

]]>
తొలి ట్వీట్ (ఎక్స్) చేసిన కేసీఆర్ https://navatelangana.com/kcr-who-made-the-first-tweet-x/ Sat, 27 Apr 2024 09:01:14 +0000 https://navatelangana.com/?p=278342 నవతెలంగాణ – హైదరాబాద్:  మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తొలి పోస్టు పెట్టారు. ” బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, తెలంగాణ రాష్ర్ట ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు ” అని కేసీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ఉద్యమం నాటి ఫోటోను జత చేశారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాలలోనే వేల మంది ఫాలోవర్స్ చేయడం గమనార్హం.

 

]]>
రెండు దశల్లోనూ బీజేపీ కనుమరుగైంది: అఖిలేష్ యాదవ్ https://navatelangana.com/akhilesh-yadav-disappeared-from-bjp-in-both-phases/ Sat, 27 Apr 2024 08:27:41 +0000 https://navatelangana.com/?p=278325

నవతెలంగాణ – హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా ఉందని ఆరోపించారు. మొదటి, రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని తెలిపారు. బీజేపీ ఓటర్లను పొందడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలంగా ఉందని తెలిపారు. బీజేపీని విడిపించుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం ఈ రెండు అంశాలే బీజేపీపై ప్రభావం చూపుతాయని తెలిపారు. బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని వివరించారు.

]]>
సోష‌ల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ! https://navatelangana.com/kcrs-entry-into-social-media/ Sat, 27 Apr 2024 08:26:20 +0000 https://navatelangana.com/?p=278336

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సోష‌ల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇప్ప‌టికే ఫేస్‌బుక్ పేజీ క‌లిగి ఉన్న ఆయ‌న ఇప్పుడు ‘ఎక్స్’ (ట్విట‌ర్) లోకి ఎంట్రీ ఇచ్చారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ త‌న ట్విట‌ర్‌ ఖాతా తెరిచారు. మాజీ మంత్రి, త‌న త‌న‌యుడు కేటీఆర్‌, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్ద‌రి అకౌంట్ల‌ను మాత్ర‌మే ఆయ‌న ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ ఎక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయ‌న ఖాతాను అనుస‌రించ‌డం చేస్తున్నాయి. అటు ఇన్‌స్టాగ్రాంలో కూడా కేసీఆర్ త‌న ఖాతాను తెరిచారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ యాత్ర విశేషాల‌తో పాటు రాజ‌కీయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విష‌యాల‌ను ఎక్స్ ద్వారా పంచుకోబోతార‌నే దాని కోసం నెటిజ‌న్లు, రాజ‌కీయ వ‌ర్గాలు, ఇత‌రులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

]]>
స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు https://navatelangana.com/15-children-injured-in-school-bus-overturn/ Sat, 27 Apr 2024 08:22:00 +0000 https://navatelangana.com/?p=278333 నవతెలంగాణ – రాంచీ: రాంచీలో పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. రాంచీలోని సదర్‌ సబ్‌ డివిజన్‌లోని మందార్‌ సీడీ బ్లాక్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 మంది పిల్లలతో వెళ్తున్న బస్సు మందార్‌లోని సెయింట్ మారియా స్కూల్‌కు 100 మీటర్ల దూరంలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు మందార్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి రాహుల్‌ తెలిపారు. బస్సులోని మిగతా పిల్లలంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

]]>
అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు భార‌తీయ మృతి https://navatelangana.com/three-indians-killed-in-fatal-road-accident-in-america/ Sat, 27 Apr 2024 08:17:05 +0000 https://navatelangana.com/?p=278330 నవతెలంగాణ – న్యూఢిల్లీ: అమెరికాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు మృతిచెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి లోనైంది. ఎస్‌యూవీ వాహ‌నం అన్ని లేన్ల‌ను దాటుకుంటూ.. 20 ఫీట్ల ఎత్తులో గాలిలోకి వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత స‌మీపంలో ఉన్న చెట్ల‌ను ఢీకొన్న‌ట్లు గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు వెల్ల‌డించారు. వాళ్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అతి వేగంగా వెళ్తున్న‌ట్లు చీఫ్ డిప్యూటీ క‌రోన‌ర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. కారును ఓ చెట్టుపై గుర్తించామ‌ని, అది ముక్క‌లు ముక్క‌లైంద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదంలో ఒక‌రు మాత్ర‌మే గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వాహ‌నంలో ఉన్న డిటెక్ష‌న్ సిస్ట‌మ్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు.

]]>
మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన మిలిటెంట్లు.. https://navatelangana.com/militants-on-the-rise-again-in-manipur/ Sat, 27 Apr 2024 08:14:13 +0000 https://navatelangana.com/?p=278326 నవతెలంగాణ – హైదరాబాద్: జాతుల మధ్య వైరంతో గతేడాది అట్టుడుకిపోయిన ఈశాన్యం రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బిష్ణూపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది క్యాంప్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌  సిబ్బంది అమరులయ్యారు. లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్‌ మణిపుర్‌ స్థానానికి శుక్రవారం పోలింగ్‌ జరిగింది. నరన్‌సైనా ప్రాంతంలో ఓటింగ్‌ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది నిన్న రాత్రి ఇక్కడి ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ క్యాంప్‌ వద్ద బస చేశారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండల ప్రాంతం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత మొదలైన కాల్పులు దాదాపు 2.30 గంటల వరకు సాగాయి. క్యాంప్‌పైకి మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ బలగాలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. సర్కార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అరూప్‌ సైనీ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

]]>
గూగుల్ లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సుందర్ పిచాయ్ https://navatelangana.com/sundar-pichai-has-completed-20-years-of-career-in-google/ Sat, 27 Apr 2024 07:59:10 +0000 https://navatelangana.com/?p=278319

నవతెలంగాణ – హైదరాబాద్:  ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆల్ఫాబెట్ లకు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను  సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని ఓసారి నెమరువేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటివరకు తన 20 ఏళ్ల సర్వీసులో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పారు. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు. “2004 ఏప్రిల్ 26.. గూగుల్ లో నా తొలి రోజు. నాటి నుంచి ఎంతో మారింది. సాంకేతికత, మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్య, నా జుట్టు.. ఇలా ఎన్నో మారాయి. కానీ ఈ గొప్ప కంపెనీలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి.. నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా” అని సుందర్ పిచాయ్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. 20 అంకె ఆకారంలో ఉన్న రెండు బెలూన్లు, లావా విరజిమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక, తన తొలి, ప్రస్తుత ఐడీ కార్డుల ఫొటోలను తన పోస్టుకు జత చేశారు.

 

]]>
వైసీపీ మేనిఫెస్టో విడుదల https://navatelangana.com/release-of-ycp-manifesto/ Sat, 27 Apr 2024 07:55:42 +0000 https://navatelangana.com/?p=278320 నవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ మేనిఫెస్టోను తాజాగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు సీఎం జగన్. ఇచ్చిన హామీలు అమలు చేసి.. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ ఓట్లు అడుగుతున్నాం. కానీ గత ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఈ 58 నెలల్లోనే ఈ మేనిఫెస్టోకి గౌరవం వచ్చిందని తెలిపారు. వారికి మాకు ఉన్న తేడాను ఒకసారి గమనించండి అని కోరారు. మేనిఫెస్టో అన్నది పవిత్ర గ్రంథం.. చెప్పిన మాటలు, వాగ్దానాలు మేనిఫెస్టోలో చెప్పినవి చేయకపోతే పేదల బ్రతుకులు చిన్నాభిన్నం అవుతాయి అనేది ఉదాహరణ అన్నారు. 2014లో నాకు బాగా గుర్తుకు ఉంది.. ఆనాడు కూడా చేయగలిగిందే మేము చెప్పాం. మోసపూరిత హామీలతో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని వెల్లడించారు. చరిత్రలో చరిత్ర హీనుడుగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించండి అన్నారు.

]]>
బీఆర్ఎస్ పుట్టుక సంచలనం: కేటీఆర్‌ https://navatelangana.com/ktr-was-the-birth-sensation-of-brs/ Sat, 27 Apr 2024 07:45:03 +0000 https://navatelangana.com/?p=278316

నవతెలంగాణ – హైదరాబాద్‌: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది అన్నారు. ఈ నేల మేలు కోరేది బీఆర్ఎస్ అని తెలిపారు. చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగనిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్‌ తెలిపారు.

]]>