ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది

ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందినాగార్జున హీరోగా విజరు బిన్ని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘నా సామి రంగ’. ఆశికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది’ త్వరలో విడుదల కానుంది. లిరికల్‌ వీడియోను లాంచ్‌ చేయడానికి ముందు పాట ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ‘రైతు గెటప్‌లో నాగార్జున చాలా ఎలిగెంట్‌గా కనిపించారు. గ్లింప్స్‌లో అద్భుతమైన బీజీఎంతో మంత్రముగ్ధులను చేసిన ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి అదిరిపోయే సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఆల్బమ్‌లోని అన్ని పాటలకు చంద్రబోస్‌ లిరిక్స్‌ రాయడం విశేషం. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది
దర్శకుడు కరుణ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్‌.

Spread the love