బస్సు బీభత్సం.. కండక్టర్‌, మహిళ మృతి

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కండక్టర్,  ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువెళ్లింది. ఈ సంఘటనలో కండక్టర్  ఒక ప్రయాణికులు మరణించారు.  అలాగే బస్సు కిందపడి మరికొందరికీ గాయాలు అయ్యాయి. విజయవాడ బస్టాండులోని ఫ్లాట్ ఫామ్ 12వ వద్ద ఈ సంఘటన జరిగింది. ఒకసారిగా ప్రయాణికుల పైకి బస్సులు దూసుకు రావడంతో ఆర్టీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అధికారులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love