నవతెలంగాణ–వీణవంక
మండలంలోని చల్లూరులో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు చెరువుల ఉత్సవాలను ఊరూరా చెరువుల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ, బోనం ఎత్తుకుని చెరువుల వద్దకు చేరుకొని బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా కట్టమైసమ్మకు బలిదానం చేశారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.