వరి పంట క్షేత్రస్థాయిలో పరిశీలన..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలోని దూపల్లి కళ్యాపూర్ గ్రామాలలో క్షేత్రస్థాయిలో వరి పంటను పరిశీలించడం జరిగిందని వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కవిత పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల వరి పంటకు కాండము తొలుచు పురుగు, ఆకు ముడత, ఎండు ఆకు తెగులు, సోకిందానీ వీటి నివారణకు సస్య రక్షణ మందులను వాడాలని ఆమె సూచించారు. ఆమె వెంట రైతు శ్రీనివాస్, పల్ల బాబు, పఠాన్ రవి, గోగు దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love