మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చెయ్యండి: నటుడు మంచు మనోజ్

నవతెలంగాణ – హైదరాబాద్ : జానీ మాస్టర్ కేసు విషయంలో త్వరితగతిన స్పందించిన హైదరాబాద్ సిటీ, బెంగళూరు నగర పోలీసులకు సినీ నటుడు మంచు మనోజ్ అభినందనలు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయాన్ని ఈ సంఘటన తెలియజేస్తోందని మనోజ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్… కెరీర్ పరంగా మీరెంత శ్రమించారో పరిశ్రమలో అందరికీ తెలుసు. అయితే, మీ వచ్చిన ఆరోపణలు నా మనసును ముక్కలు చేసింది. తప్పు ఒప్పులను చట్టం నిర్ణయిస్తుంది. నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది. ఒక తనపై అఘాయిత్యం జరిగిందని గొంతు విప్పినప్పుడు, మీరు పారిపోవడం… సమాజానికి, భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన సంకేతాన్నిస్తుంది. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చెయ్యండి. దోషి అయితే… అంగీకరించండి’ అంటూ తన పోస్టులో మనోజ్ పేర్కొన్నారు.

Spread the love