భూ పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణం

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌.రాజు
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
భూ పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌ రాజు అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ మండలం సాహెబ్‌ నగర్‌ వెంకటేశ్వర కాలనీలో పేదలకు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేద ప్రజలతో కలిసి ఇండ్ల స్థలాల నిరసన కార్యక్రమాలో భాగంగా శనివారం రాత్రి ప్రభుత్వ భూమిలోని సర్వే నెంబర్‌ 71/1 గుడిసెలు వేశారు. ఇది గమనించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రజలు ప్రజాసంఘాల నాయకులపై అర్ధరాత్రి చిన్న పిల్లలు మహిళలు చూడకుండా మొత్తం 19 మంది పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని బెషరతుగా విడుదల చేయాలని ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇళ్లస్థలాలు వెంటనే ఇవ్వాలని, లేనిచో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో ప్రజాసంఘాలు ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీను నాయక్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబు, న్యాట్కో యూనియన్‌ కార్యదర్శి మల్లేష్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌ నాయక్‌, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love