సింగిల్ స్ర్కీన్ థియేటర్ల మూసివేతపై స్పందించిన ఫిలిం ఛాంబర్

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజుల పాటు మూసివేయడంపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం అని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత నిర్ణయంతో ఫిలిం ఛాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించింది. ఇది పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం అని తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Spread the love