అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ

ముంబయి : మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్‌ పవార్‌ గ్రూపు ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు కేటాయించారు. ఎన్‌సిపి నుంచి విడిపోయి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సుమారు రెండువారాల తరువాత ఈ 9 మంది ఎమ్మెల్యేలకు శుక్రవారం మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్‌ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖలను కేటాయించారు. భగన్‌ భుజబల్‌కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖను కేటాయించారు. అదిత తట్కరేకు మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. షిండే ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రి ఆదిత కావడం విశేషం.

Spread the love