ఆర్థిక సాయం అందజేత..

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పట్టాభిషేకం కార్యక్రమానికి ఆర్థిక సాయంగా వైయూపీపీ టీవీ, ట్యురిటో సంస్థల అధినేత రూ.15వేల116 ఆర్థిక సాయంగా పంపించారు. కాగా ఆ నగదును ఆ సంస్థ ప్రతినిధులైన మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ సమ్మిరెడ్డి, దాసారపు లోకేష్, సమిండ్ల చిట్టి, తాళ్లపల్లి కుమారస్వామి, సమ్మిరెడ్డి, శేఖర్, తొట్ల రాకేష్ తదితరులు గ్రామ పంచాయతీ పాలకర్గానికి అందజేశారు.

Spread the love