బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం

– చైర్మన్ పాండు రంగారెడ్డి…
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, మదారిగూడెం గ్రామానికి చెందిన గడ్డం సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తన పౌండేషన్ సభ్యులద్వారా తెలుసుకొని సోమవారం వారి ఇంటికీ వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి. విరితో పాటు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,మాజీ సర్పంచులు  జనార్ధన్ రెడ్డి,  నడ్డి లింగయ్య, మాజీ యంపిపి రిక్కల రామకృష్ణారెడ్డి, షేక్ ముస్తాఫ, గౌరు శ్రీనాధ్, గడ్డం సజ్జన్, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, అనుముల కోటేష్, ఇస్రం లింగస్వామి, మల్లిఖార్జున చారి, రమేష్ చారి,గజ్జల శివానంద రెడ్డి, పాతనబోయిన కోటేష్, బీరెల్లి శ్రీధర్ రెడ్డి, కోడుమూరి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love