నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆర్థిక సహాయం

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని రెడ్డి పేటకు చెందిన మొగ్గం లక్ష్మి మృతి చెందగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలుసుకొని సోమవారం నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కుటుంబానికి మొదటి వరుసలో ప్రాధాన్యత ఇచ్చి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నా రెడ్డి శ్రీనివాసరెడ్డి, దన్ సింగ్, నరసింగరావు, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love