తోటి ఎంపీటీసీకి ఆర్థిక సహాయం

నవతెలంగాణ- రామారెడ్డి
తోటి ఎంపీటీసీ అనారోగ్యంతో, ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మానవత్వంతో ఆదివారం ఆర్థిక సహాయాన్ని గిద్ద ఎంపిటిసి ప్రవీణ్ గౌడ్ అందజేశారు. రామారెడ్డి ఎంపిటిసి- 2 నూనె భాగ్యలక్ష్మి శ్యామ్ అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని లక్ష్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకొని, ఆసుపత్రిలో ఆమెను పరామర్శించి, తన వంతు సహాయంగా రూ,10000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి శామ్, ప్రవీణ్ గౌడు కు కృతజ్ఞతలు తెలిపారు. పరామర్శించిన వారిలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు గర్గుల రాజా గౌడ్, రామారెడ్డి- 1ఎంపీటీసీ తుపాకుల రజిత రాజేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బొంపల్లి దత్తాత్రి, రాజేందర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

Spread the love