మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు స్వామికి మంగళవారం 2006-07 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీ డాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వర్తించే స్వామి, కరెంటు పనులను కూడా చేస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో కరెంటు స్తంభంపై విద్యుత్ పనులు చేస్తుండగా షాక్ గురై కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో స్వామి కాళ్లు, చేతులు కాళ్ళడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సలు తీసుకొని, ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వచ్చాడు. బాధితుడు స్వామి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన 2006-07 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు తమ వంతు సహాయంగా రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు ఆర్థిక సహాయం మొత్తాన్ని బాధితుడు ఇంటి వద్దకు వెళ్లి అందజేసి, పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని, విచారం వ్యక్తం చేశారు. అధైర్య పడద్దని సూచించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 2006-07 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు పోలీస్ కానిస్టేబుల్ లు రఘువీర్ గౌడ్, శేఖర్ గౌడ్, శేఖర్, మణిదీప్, శివ రెడ్డి, మొకిమ్, శ్రీనివాస్, అజార్, శివరాం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.