మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రంలోని కొత్త రాయపర్తి కాలనీకి చెందిన గారె రామచందర్ ఇటీవల అనారోగ్య సమస్యతో ఆకాల మరణం చెందగా మంగళవారం దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి రూ7800 ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గారె బాబు మాట్లాడుతూ.. కాలానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం అన్నారు. కాలనీలో ప్రతి కుటుంబానికి యువశక్తి యువజన సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాచర్ల పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి గారె సందీప్, ఉపాధ్యక్షులు మధు, నరేష్, ముఖ్య సలహాదారుడు వెంకన్న, సభ్యులు రామకృష్ణ, అనిల్, విష్ణు, సుధాకర్, సాయిల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love