
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రానికి చెందిన వడ్ల రమేష్ భార్య అయిన అరుణ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందించినట్లు దాదా పులి రామచంద్రు తెలిపారు. ఆదివారం మృతి చెందిన కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల కు మనోధైర్యం నింపి ప్రగాఢ సానుభూతి ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆమె సమాజంలో అందరితో మంచిగా కలియతిరిగి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేసిందని అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మృతి చెందడం తీరనిలోటు అని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కుల ఆదిరెడ్డి పోతుగంటి శ్రీను తదితరులు ఉన్నారు.