బాధితుడికి ఉప్పల ట్రస్టు ద్వారా ఆర్థికసాయం

నవతెలంగాణ-తలకొండపల్లి
ఆపదలో ఉన్న ఆ నిరుపేద కుటుంబానికి నా వంతుగా సహాయం ఉంటుందని రాష్ట్ర మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్‌ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వడ్డెర జంగయ్య అనే వ్యక్తికి గత నాలుగు సంవత్సరాల క్రితం తలకొండపల్లి నుండి ఆమనగల్‌ రహదారిలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయి కాలు నడవడానికే రాకపోవడంతో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్‌ మూడు చక్రాల బండికి వడ్డెర జంగయ్య ఉప్పల చారిటబుల్‌ ట్రస్టు ద్వారా రూ. 20 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బుచ్చిబాబు, రఘువీర్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love