బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

 నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో సోమవారం నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామానికి చెందిన బెస్త సురంగాల రాజయ్య, గిరి శివరాజు ఇరువురు అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తోటి వారు ఆపదలో ఉన్నప్పుడు, మానవత దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, గిద్ద ఎంపిటిసి ప్రవీణ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల నర్సారెడ్డి, బండి ప్రవీణ్, దుంపల బాలరాజ్, గజ్జల చిన్నరాజు, కుల పెద్దలు, తదితరులు ఉన్నారు.
Spread the love