ఆర్థిక పాఠాలు చెబుతూ…

Giving financial lessons...మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా ఇంకా ఏదో చేయాలనే తపన నిషా షా ను నిలవనీయలేదు. లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పని చేస్తున్న ఆమెకు ఏడాదికి రెండున్నర లక్షల డాలర్లకు పైనే జీతం. కానీ కార్పొరేటర్లకు ఉపయోగపడే ఆ పని ఆమెకు తృప్తినివ్వలేదు. అందుకే యూట్యూబర్‌గా సరికొత్త అడుగులు వేసింది. సామాన్యులకు ఆర్థిక పాఠాలు చెబుతూ ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తుంది.
ఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్‌లో చేస్తున్నది కార్పొరేషన్‌లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే ఆమె పని. అయితే తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురికి ప్రయోజనం చేకూరాలనుకుంది. దానికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది నిషా. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2023 జనవరిలో ఉద్యోగం పూర్తిగా వదిలేసి యూట్యూబ్‌ను కొనసాగించాలని ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది.
2021 డిసెంబర్‌లో తన పేరుతోనే ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. తనకు ఆసక్తి, పట్టు ఉన్న పర్సనల్‌ ఫైనాన్స్‌, సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌, బిజినెస్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్‌ చేసేది. బిజినెస్‌ విషయాలు కావడంతో మొదట్లో ఆశించిన ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్ల కోసం దాదాపు ఏడాది ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా పట్టుదలగా ముందుకే సాగింది. 2022 సెప్టెంబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా తన అనుభవాలు వివరిస్తూ చేసిన వీడియో వైరల్‌ అయింది. 50 వేలకు పైగా సబ్‌స్క్రైబర్‌లు వచ్చారు. మూడు లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్‌ చేస్తోంది. పర్సనల్‌ ఫైనాన్స్‌ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలు షేర్‌ చేస్తుంది. ముఖ్యంగా మనీ హ్యాబిట్స్‌ కీపింగ్‌ యు పూర్‌ నుండి మీ తొలి పెట్టుబడి ఎలా పెట్టాలి వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్‌ విభిన్నంగా, బిజినెస్‌లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది.
అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ.8కోట్లను దాటేసింది. యూట్యూబ్‌ మానిటైజేషన్‌, కోర్సు విక్రయాలు, కార్పొరేట్‌ స్పీకింగ్‌ ఎంగేజ్‌మెంట్‌లు, బ్రాండ్స్‌ పార్టనర్‌షిప్‌ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి, పట్టుదల, టాలెంట్‌ ఉంటే ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నిషా విజయ గాథ మనకు తెలియజేస్తుంది. లండన్‌కు చెందిన ఆమె నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌ విభాగంలో డిగ్రీ, ఆ తర్వాత ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ చదివారు. న

Spread the love