ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సదస్సు..

Financial Literacy Awareness Conference..– నాబార్డ్ ఆర్ధిక సౌజన్యంతో …
నవతెలంగాణ – గోవిందరావుపేట
నాబార్డ్ ఆర్ధిక సౌజన్యంతో ఏపీజీవీబీ పసర బ్రాంచి ఆధ్వర్యంలో గురువారం మోద్దులగూడెం గ్రామమంలో ఆర్ధిక అక్షరాష్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కళాజాత బృందం ద్వారా బ్యాంకు అందించే వ్యవసాయ పంట రుణాలు, మహిళా సంఘాల రుణాలు, గోల్డ్ లోన్స్, డిపాజిట్స్ పై అధిక వడ్డీ, సైబర్ నేరలపై మరియు కేంద్ర ప్రభుత్వం అందించే భీమా పథకాలు మొదలైన వాటి గూర్చి మ్యాజిక్ షోలు, జానపద గేయాలా ద్వారా ఖాతాదారులకు అవగాహన కలిపించారు. అనంతరం ఖాతాదారులు ప్రజలను ఉద్దేశించి యం ప్రేమ్ కుమార్ ఎఫ్ ఎల్ సి కౌన్సిలర్,  హాజరై మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు ఏపీజీవీబీ అందించే సేవలు ఉపయోగించుకోవాలి, బ్యాంకులో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాల్లన్నారు. వ్యవసాయ పంట రుణాలు సంవత్సరం లోపు చెల్లించితే వడ్డీ రాయితీ వస్తుంది కావున రైతులు ఈ అవకాశం ఉపయోగించు కోవాలి. డిపాజిట్స్ అధిక వడ్డీ ఇస్తున్నారు, గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నారు కావున అవకశం ఖాతా దారులు వినియోగించు కోవాలి అలానే “భీమా చేయండి ధీమాగా” ఉండండి అని ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమాలో, సురక్ష భీమా యోజనలలో అర్హత ఉన్న ఖాతాదారులు చేరాలి, అటల్  పెన్షన్ యోజన గురించి తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి ఎవరికీ ఖాతా, ఎటిఎం,ఓటీపీ సి వి వి నెంబర్లు చెప్పద్దు. ఆన్ లైన్ మోసలపై జాగ్రత్తగా ఉండాలి తెలియజేసారు. జనవరి 1 నుండి తెలంగాణలో ఉన్న ఏపీజీవీబీ శాఖలు,  తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్నాయి కావున సాంకేతిక పరంగా సేవలు అంతరాయం జరుగును కావున ఖాతాదారులు సహకరించాలన్నారు.ఈ సదస్సులో యెఫ్ ఎల్ సి కౌన్సిలర్,  కళాజాత బృందం బ్యాంకు మిత్ర సంతోష్,ఖాతాదారులు తదితరులు పాలుగోన్నారు.
Spread the love