నవతెలంగాణ-నల్గొండడెస్క్
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ గుండెపోటు తో మరణించిన ఏఎస్ఐ యస్.యాదగిరి సతీమణి అరుణ కి జిల్లా అడిషనల్ ఎస్పీ కె ఆర్ కె ప్రసాద్ రావు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో 7,97,900 రూపాయల భద్రతా చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కషి చేస్తామన్నారు. చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దయాకర్, జూనియర్ అసిస్టెంట్ మాదవి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.