ప‌శ్చిమ బెంగాల్ రాజ్‌భ‌వ‌న్ లో ముగ్గురు ఉద్యోగుల‌పై ఎఫ్ఐఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు ఇచ్చేంద‌కు ప్ర‌య‌త్నించిన ఓ మ‌హిళా ఉద్యోగిని అడ్డుకున్న కేసులో రాజ్‌భ‌వ‌న్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగుల‌పై ఇవాళ కోల్‌క‌తా పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ కేసులో ముగ్గుర్నీ నిందితులుగా చేర్చారు. గుర్తించిన‌వారిలో ఓఎస్డీ ఎస్ఎస్ రాజ్‌పుత్‌, ప్యూన్ సంత్ లాల్‌, కుసుమ్ ఛ‌త్రీలు ఉన్నారు. మే 2వ తేదీన ఈ ముగ్గురూ రాజ్‌భ‌వ‌న్‌లో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేశారు. వీరిపై ఐపీసీ సెక్ష‌న్ 341, 166 కింద కేసు బుక్ చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న మ‌హిళ ఫిర్యాదు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో ఆమెను అడ్డుకున్నారు. సెక్ష‌న్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఆ బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు.

Spread the love