నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల వల్ల హాస్పిటల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆస్పత్రిలో భారీ మంటలు చెలరేగటంతో పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

Spread the love