నవతెలంగాణ జన్నారం
అప్రమత్తతతో అగ్ని ప్రమాదాలు నివారించుకోవచ్చని జన్నారం మండల అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని కలమడుగు జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపకాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా ఆతురత పడకుండా అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. తమ సిబ్బందితో ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి సాధ్యమైనంత వరకు ప్రమాదాన్ని అరికడతామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి ఉపాధ్యాయులు విద్యార్థులు అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.