ముస్సోరిలోని హౌటల్‌లో అగ్ని ప్రమాదం

 Sona Mussoorie should allow exportsడెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ముస్సోరిలోని ఓ హౌటల్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. హౌటల్‌ మరమ్మత్తు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హిల్‌స్టేషన్‌లోని హౌటల్‌కి సంబంధించిన అగ్నిప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. ఈ ఘటనలో మరో రెండు వాహనాలు దగ్ధమైనట్టు ఎస్‌హెచ్‌ఒ తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love