నవతెలంగాణ – కోల్‌కతా
కోల్‌కతా విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు వెలుపలికి వెళ్లే పోర్టల్ డీ 3సీ గేటు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రయాణికులను సురక్షిత మార్గం ద్వారా బయటకు పంపినట్టు అధికారులు తెలిపారు. తొలుత చిన్నగా ప్రారంభమైన మంటలు తీవ్రరూపం దాల్చడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ప్రమాదంతో ఎయిర్‌పోర్టు ఆవరణ అంతా నల్లటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, దీని కారణంగా చెక్-ఇన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసి తర్వాత పునరుద్ధరించినట్టు ఉన్నతాధికారి ఒకరు ట్వీట్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.