నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ శివారులోని నటరాజ్ మోడ్రన్ బిన్నీ రైస్ మిల్లులో శనివారం మరమ్మత్తుల నిమిత్తం వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి వడ్ల బస్తాల పై పడటంతో మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ధారాళంగా వ్యాపిస్తుందడంతో పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి మిల్లు యజమాని సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద సమయంలో మిల్లులో దాదాపు 96,000 టన్నుల ధాన్యం ఉందని, దాదాపు రూ. 80 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని బుచ్చిరాములు తెలిపారు.