అమెరికాలో అగ్నిప్రమాదం.. భారతీయ వ్యక్తి సజీవ దహనం

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని చికాగో సబర్బన్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమవగా.. రెండో అంతస్తులో ఉన్న 75 ఏళ్ల వ్యక్తి బయటకు రాలేక సజీవదహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు వివరాల ప్రకారం కూమార్తెతో సంతోషంగా గడపడానికి విజిటింగ్ వీసాపై అమెరికా వచ్చినట్లు చెప్పారు. అయితే పక్కింట్లో వెలిగించిన దీపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Spread the love