నవతెలంగాణ -హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డెయిరీఫామ్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా ఒక్కోవాహనానికి అంటుకోవడంతో సెల్లార్‌లో ఉన్న కార్లు, బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.