మేడ్చల్ పత్తి గోదాంలో అగ్నిప్రమాదం..

Fire in Medchal cotton warehouseనవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరు గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిల్వ ఉంచిన పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గోదాం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాలుగు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కాగా అందులో పనిచేస్తున్న కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం.

Spread the love