మార్కెట్‌లో అగ్నిప్ర‌మాదం..1000 జంతువులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్యాంకాక్‌లో ఉన్న ఫేమ‌స్ ఓపెన్ ఎయిర్ చాటుచ‌క్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో సుమారు వెయ్యి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. వీటిల్లోప‌క్షులు, కుక్క‌లు, పిల్లులు, స‌ర్పాలు ఉన్నాయి. పెంపుడు జంతువుల కేజ్‌లలో ఉన్న‌ ఎలుక‌లు, పైతాన్లు కూడా కాలి బూడిద‌య్యాయి. ఎల‌క్ట్రిక‌ల్ షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌లు వ్యాపించాయి. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయాలు కాలేదు. చాటుచాక్ మార్కెట్‌లో వేల షాపులు ఉన్నాయి. చిన్న చిన్న సందుల్లో ఉండే ఈ షాపుల‌కు క‌స్ట‌మ‌ర్లు కూడా వేల సంఖ్య‌లో వ‌స్తుంటారు. ద‌క్షిణ ఆసియాలో ఇది చాలా పెద్ద మార్కెట్‌. కేవ‌లం శ‌ని, ఆదివారాల్లో ఆ మార్కెట్‌కు దాదాపు రెండు ల‌క్ష‌ల మంది టూరిస్టులు వ‌స్తుంటారు. అగ్నిప్ర‌మాదం వ‌ల్ల పెట్ జోన్‌లో ఉన్న 118 షాపులు మంట‌ల్లో ఆహుత‌య్యాయి.

Spread the love