వియత్నాంలో అగ్నిప్రమాదం – 14 మంది మృతి

నవతెలంగాణ – వియత్నాం : వియత్నాంలోని హనోయి అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి, ముగ్గురు గాయపడ్డారు. ఒక చిన్న అపార్ట్‌మెంట్ భవనంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 14 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. ముందుగా మంటలు ప్రారంభమై అనేక పేలుళ్ల జరగగా మంటలు చెలరేగాయని వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మంటలను ఆర్పడానికి గంట సమయం పట్టిందని, మంటలు చెలరేగినప్పుడు లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియలేదని అధికారులు తెలిపారు.

Spread the love