టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా..

నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, జనసేన పార్టీలు తమ తొలి జాబితాను ప్రకటించాయి. తొలి జాబితాలో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలో మొట్టమొదటిసారిగా… విస్తృత స్థాయిలో 1 కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడించారు. నిజాయతీ, అంకితభావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా ఎంపిక చేసిన టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది అని వివరించారు. ఏపీ ప్రజలారా… ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు.

Spread the love