నా లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌..

First time in my life..వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్‌ రోల్స్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘అతిథి’. రాండమ్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై దర్శకుడు భరత్‌ వైజీ రూపొందించారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌ డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హీరో వేణు మాట్లాడుతూ, ‘కొందరు క్లాసీగా ఉందని, మరికొందరు మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని అంటున్నారు. నన్ను అడిగితే ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ మూవీ లాంటిది. ఇందులో కామెడీ, సస్పెన్స్‌, డ్రామా, సెంటిమెంట్‌ అన్నీ ఉన్నాయి. హర్రర్‌ ఎలిమెంట్స్‌ తక్కువ. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్‌ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ హర్రర్‌ కంటెంట్‌లో నటించాను. నా పర్‌ఫార్మెన్స్‌కు మంచి పేరొస్తుందంటే ఆ క్రెడిట్‌ దర్శకుడు భరత్‌కే ఇవ్వాలి. ప్రవీణ్‌ సత్తారు ఈ సిరీస్‌ కోసం మంచి ఎఫర్ట్‌ పెట్టారు’ అని చెప్పారు.

Spread the love