నవతెలంగాణ – మునుగోడు
అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఐదురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బొల్లం వెంకటేష్ , కనగల్ మండలంలోని కురంపల్లి గ్రామానికి చెందిన దోటి రామరాజు హైదరాబాద్ లోని ధూల్ పేట్ చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర (5) ప్యాకెట్లు లలో 200 గ్రాములు రూ. 2 వేల చొపున మొత్తం రూ.10 వేల గంజాయిని కొనుగోలు చేసి మండల కేంద్రంలోని లక్ష్మీదేవి గూడెం కు వెళ్లే రోడ్డు పక్కలోని పశుల సంత లోని రేకుల షెడ్డులో మునుగోడు మండల కేంద్రానికి చెందిన అరునెల్లి వికాస్ వర్ధన్ అలియాస్ డాన్ , మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి వచ్చిన వీరమల్ల లింగస్వామి, గుర్రంపోడు మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేశ్ తో విక్రయించేందుకు రాగా షెడ్డులో కూర్చోగా పక్క సమాచారం తెలుసుకున్న మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి పట్టుకోగా విచారణలో ఐదురు నిందితులు పట్టుబడ్డారు.
వారి నుండి అందాజ 1000 గ్రాములు గంజాయిని, 4 సెల్ ఫోన్ లు, గంజాయి రవాణా చేయుటకు ఉపయోగించిన బైక్లను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి, మునుగోడు చుట్టు ప్రక్కల వారకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇందులో బాగముగా 35 మంది భాదితులను గుర్తించి, వారిలో కొంత మందికి పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లుగా వచ్చినది మరియు అందరికి కౌన్సిలింగ్ చేసినట్లు తెలిపారు. పల్లెల్లో పట్టణాలలో డ్రగ్స్ కు బానిస యువత పెడదారిలో వెళ్లి కుటుంబాలను వీధిపాలు చేస్తున్న కుటుంబాలకు రక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్నారు .గంజాయి కేసును సేదించిన నల్గొండ డి.ఎస్పి కె.శివరాం రెడ్డి , చండూర్ సి.ఐ ఎ. వెంకటయ్య ,మునుగోడు యస్.ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తో సిబ్బంది రమేశ్, నర్సింహా, వెంకన్న, నాగేశ్వర రావు, ఆంజనేయులు, జానీ, మోహన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.