నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బీహెచ్ సహదేవ్‌రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.