కాలువలో పడిన వాహనం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

fatal-road-accident-in-apనవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. సోమవారం మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రావల్పిండి మోటర్‌వేపై గ్యాస్ ట్యాంకర్, కారు ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. గ్యాస్‌ ట్యాంకర్‌ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో కారును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ రావల్పిండి నుంచి ఫైసలాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పూర్తి చేశారు. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Spread the love