ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

నవతెలండాణ – మహారాష్ట్ర:  చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. కారులోనే నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరిని నాగ్‌భిడ్‌ గ్రామీణ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారి పేర్కొన్నారు.

Spread the love